పుదీన ఇది లేనిదే నాన్ వెజ్ వంటకం అసంపూర్తిగానే ఉంటుంది. అంతేకాదండొయ్ ఇతర ఆరోగ్యకరమైన అంశాలు ఈ పుదీనాలో ఉన్నాయి. పుదీనా ఇది దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటాయి. పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పుదీనాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాసిడ్స్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణక్రియను మెరుగు పర్చడం వల్ల సహజసిద్ధంగా బరువు తగ్గవచ్చని పరిశోధనలో తేలింది. అందుకే ఆహారంలో పుదీనాను చేర్చుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. పుదీనాలో ఆకలిని తగ్గించే గుణాలు కూడా ఉంటాయి. మీకు ఆకలి తగ్గితే.. తక్కువ కేలరీలు తీసుకుంటారు. ఇది మీరు త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజూ మీరు రెండు, మూడు పుదీనా ఆకులు తింటే.. మీరు త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి. మీరు PCOS వంటి కొన్ని హార్మోన్ల అసమతుల్యత కారణంగా బరువు పెరిగితే.. పుదీనా మీకు సహాయం పడుతుంది. పుదీనాలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెరగడానికి సహాయపడుతుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉంటే.. మెనోపాజ్ సమయంలో బరువు పెరుగుతారు. పుదీనా తింటే.. హార్మోన్ల సమతుల్యతను పునరుద్ధరిస్తుంది.