ఆకే కదాని పక్కన పెట్టేయకండి. అది మీ బరువును సునాయాసంగా తగ్గించగలదు. ఈ రోజుల్లో అధిక బరువు సమస్య చాలా మంది ఇబ్బంది పెడుతుంది. మారిన లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, వేళకు తినకపోవడం, సమయానికి నిద్ర పోకపోవడం లాంటి కారణాల వల్ల అధికంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఈ అధిక బరువు ఎన్నో రోగాలకు దారి తీస్తుంది. బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొందరికి వ్యాయామం చేయడానికి టైమ్ ఉండదు. సన్నబడాలని కడుపు కాల్చుకుంటారు. ఎన్నో డైటింగ్‌లు చేస్తారు. అలాంటి వారి కష్టం కొంత తగ్గించడానికి కొన్ని ఆకులు సహాయపడతాయని అంటున్నారు నిపుణులు. మీకు సులభంగా దొరికే ఈ ఆకులు తీసుకుంటే.. త్వరగా బరువు తగ్గుతారని ప్రముఖ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్, ఫ్యాట్ టూ స్లిమ్ డైరెక్టర్ శిఖా అగర్వాల్ అన్నారు. అలాంటి ఆకుల్లో పుదీనా, వాము ఆకు, రోజ్ మేరీ ఆకు ఇలా అనేక ఆకులు తినడం వల్ల అధిక బరువును సునాయాసంగా తగ్గించుకోవచ్చటా.