గడపగడపకు వెళ్తే రాళ్లతో కొట్టే రోజులు త్వరలో వస్తాయని వైసీపీ నేతలకు టీడీపీ సీనియర్ నేత జే.సీ.ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విఫలం కావడంతోనే గడపగడప అంటోందని ఎద్దేవా చేశారు జేసీ. గడపగడపకు వెళ్తే రాళ్లతో కొట్టే రోజులు త్వరలో వస్తాయని, వైఎస్సార్‌సీపీ పాలనలో గుడికి వెళ్లేందుకు కూడా అనుమతి తీసుకోవాలని రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు. మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతల బస్సు యాత్రకు పోలీసుల పహారా పెట్టుకోవాలని సూచించారు. ప్రజలు రాళ్లు వేస్తారు.. వైఎస్సార్‌సీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు
తాడిపత్రి మున్సిపల్ ఛైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 26 నుంచి బీసీ మంత్రులు చేపట్టనున్న బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశాలున్నాయని.. తనకు అనుమానాలు ఉన్నాయంటూ బాంబ్ పేల్చారు. బస్సులకు సేఫ్ గార్డ్‌లు పెట్టుకుంటే మంచిదని.. పోలీసులు వాహనాలకు ఉపయోగించే విధంగా ఫెన్సింగ్ పెట్టుకుంటే బావుంటుందని సలహా ఇచ్చారు.
ఈ నెల 23, 24, 25న జేసీ నాగిరెడ్డి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి టీమ్‌లు వస్తున్నాయని.. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని.. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో కనీసం గుడికి వెళ్లేందుకు కూడా పర్మిషన్ తీసుకోవాలంటూ మండిపడ్డారు.
రాయదుర్గంలో స్వామి వారి కళ్యాణంలో తప్పు చేశారని.. తప్పు ఒప్పుకోకుండా సవాళ్లు చేస్తారా.. పోలీసులతో అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. త్వరలో మాజీ కాల్వ శ్రీనివాస్‌తో కలిసి వెంకటరమణస్వామి ఆలయానికి వస్తానన్నారు. ప్రభుత్వం వైఫల్యం చెందడంతో గడప గడప అంటున్నారని.. గడప గడపకూ వెళ్తే రాళ్ల తో కొట్టే రోజులు వస్తాయన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, అడుగడుగాన అక్రమాలు, ఆక్రమణలే ఉన్నాయని విమర్శించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,