ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ లో పైసలు పెడితే ...అద్బుత లాభాలు

business |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 08:37 PM

స్టాక్ మార్కెట్  లో సంపాదించినవారుంటే పోగొట్టుకొన్న వారు సైతం అంతకంటే ఎక్కువగానే ఉంటారు. కానీ త్వరగా మనీ సంపాదించుకోవాలి.. బాగా సెటిల్ కావాలి అనుకునే వాళ్లకి స్టాక్ మార్కెట్ అనేది ఒక ఉత్తమమైన మార్గం. మీరు సరియైన షేర్లను ఎంచుకుంటే తక్కువ సమయంలోనే, తక్కువ డబ్బుతో ఎక్కువ లాభాలను పొందవచ్చు. స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ ధర కేవలం పైసల్లోనే ఉంటుంది. కానీ కొన్ని నెలల్లో లేదా ఏడాది కాలంలో ఇవి ఇచ్చే రిటర్నులు అద్భుతంగా ఉంటున్నాయి. అలాంటి స్టాక్స్‌లో ఒకటే రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్. ఈ పెన్నీ స్టాక్ ధర ఏడాది క్రితం కేవలం 22 పైసలు మాత్రమే. ప్రస్తుతం రూ.11న పైన ఈ షేరు ట్రేడవుతోంది.


శుక్రవారం బీఎస్ఈలో రాజ్ రేయాన్ ఇండస్ట్రీ షేరు ధర 5 శాతం లాభంలో రూ.11.86 వద్ద ముగిసింది. 2021 మే 24న ఈ కంపెనీ షేరు ధర ఒక్కోటి 22 పైసల వద్ద ట్రేడైంది. అప్పటి నుంచి ఈ షేర్లు పెరుగుతూనే ఉన్నాయి. ఏడాది సమయంలో తన ఇన్వెస్టర్లకు రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ 5,290.91 శాతం రిటర్నులను ఇచ్చింది. అదేవిధంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 778 శాతానికి పైగా ఈ షేరు పెరిగింది. గత నెలలో రూ.4.77 వద్ద ఉన్న షేర్లు ప్రస్తుతం రూ.11.86కి పెరిగాయి. అంటే నెలలోనే 150 శాతం మేర ఈ స్టాక్ పెరిగిది. గత ఐదు ట్రేడింగ్ సెషన్స్‌లోనే రాజ్ రేయాన్ షేర్లు తన ఇన్వెస్టర్లకు 21 శాతానికి పైగా రిటర్నులను అందించాయి.


ఏడాది క్రితం ఈ స్టాక్‌లో పెట్టుబడి పెట్టిన వారికి 5 వేల శాతానికి పైగా రిటర్నులు అందాయి. అంటే ఏడాది క్రితం ఈ కంపెనీలో లక్ష రూపాయలను పెట్టుబడిగా పెట్టి.. అమ్మకుండా ఉంటే.. ప్రస్తుతం వీటి నుంచి రూ.53.90 లక్షలను పొందేవారు. అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభంలో లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుతం వారికి రూ.8.78 లక్షల వస్తాయి. నెలలోనే ఈ కంపెనీ ఇన్వెస్టర్లు లక్షకు రూ.రెండున్నర లక్షల వరకు రిటర్నులను పొందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com