ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్ ఎన్రోల్మెంట్...అప్ డేట్ ఇక పోస్టాపీసుల్లో కూడా చేసుకోవచ్చు

national |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 08:38 PM

ఆధార్ కార్డు విషయంలో కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది. దీంతో ఆధార్ సంబంధిత సమస్యను సకాలంలో పూర్తయేలా చర్యలు తీసుకొంటోంది. ఆధార్ కార్డు అనేది ఎన్నో పనులకు ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంకు అకౌంట్ తెరవాలన్నా.. మొబైల్ సిమ్ కార్డు కొనాలన్నా.. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాలన్నా ఈ కార్డు ఎంతో అవసరం. ఆధార్ కార్డు ఎన్‌రోల్ కోసం లేదా అప్‌డేట్ కోసం మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఎవరైనా ఆధార్ అప్‌డేట్ చేపట్టుకోవాలన్నా.. లేదా ఎన్‌రోల్ చేసుకోవాలన్నా ఇక నుంచి మీకు దగ్గర్లోని పోస్టాఫీసులో చేసుకోవచ్చని ఇండియా పోస్టాఫీసు చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 13352 పోస్టాఫీసు కేంద్రాలు దేశ ప్రజలకు ఆధార్ సర్వీసులను అందించడంలో సాయపడతాయని ఇండియా పోస్టు ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ కేంద్రాలకు వెళ్లి ఆధార్ అప్ డేట్ లేదా ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్యాంకు బ్రాంచులు, పోస్టాఫీసులు ఆధార్ సెంటర్లుగా పనిచేస్తున్నాయి. ఇండియా పోస్టు వెబ్‌సైట్ ప్రకారం పోస్టాఫీసు ఆధార్ కేంద్రాలు ప్రధానంగా రెండు రకాల సర్వీసులను అందజేస్తున్నాయి. ఒకటి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, రెండు ఆధార్ అప్‌డేషన్.


ఆధార్ ఎన్‌రోల్‌మెంట్..


ఎన్‌రోల్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా దేశ పౌరుల బయోమెట్రిక్, డెమొగ్రాఫిక్ సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌గా స్వీకరిస్తారు. పోస్టాఫీసుల్లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అనేది పూర్తిగా ఉచితం.


ఆధార్ అప్‌డేట్..


పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, అడ్రస్, పుట్టిన తేదీ వంటి డెమొగ్రాఫిక్ అప్‌డేషన్‌ను పోస్టాఫీసుల్లో చేసుకోవచ్చు.


బయోమెట్రిక్ అప్‌డేషన్‌ను, ఫోటోను, ఫింగర్ ప్రింట్లను, ఐరిస్‌ను పోస్టాఫీసుల ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే ఈ అప్‌డేట్ కోసం రూ.50ను(జీఎస్టీ కలుపుకుని) సర్వీసు ఛార్జీగా తీసుకుంటారు.


ఆధార్ కేంద్రానికి వెళ్లేటప్పుడు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు..


సపోర్టింగ్ డాక్యుమెంట్లకు చెందిన ఒరిజినల్ కాపీలు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌కు అవసరం. ఈ ఒరిజినల్ కాపీలను స్కాన్ చేసి, మీకు ఈమెయిల్ చేస్తారు.


ఒకవేళ మీ చేతి వేళ్లు లేదా కళ్లు దెబ్బతింటే కూడా ఆధార్‌కు అప్లయి చేసుకోవచ్చు.


ఆధార్ కార్డు జనరేట్ అవ్వడం కోసం 90 రోజుల సమయం పడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com