ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పథకాల్లో ఇన్వేస్ట్ చేస్తే..ఏడు శాతానికి పైగా రిటర్న్

national |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 08:39 PM

ఎక్కడ ఇన్వేస్ట్ చేస్తే మంచి రిటర్న్ న్స్ వస్తాయన్నది ఎవరైనా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అలాంటి వారికి పోస్టాఫీసు పథకాలు ఎంతో మేలు చేకూర్చుతాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. పొదుపు అనేది ఎంతో అవసరం. భవిష్యత్‌లో ఏ అవసరానికైనా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. ప్రజలు తమ సంపాదించే డబ్బుల్లో కొంత మేర సేవింగ్స్ పేరుతో పక్కన తీసి పెట్టుకోవాలి. సామర్థ్యం మేరకు సేవ్ చేసుకుంటే చాలు. మనం ఇన్వెస్ట్ చేయడానికి మార్కెట్లో ఎన్నో పథకాలున్నాయి. వాటిల్లో ఉత్తమమైన పథకాలలో పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్స్ ఒకటి. పోస్టాఫీసుల్లో మీరు పెట్టిన మనీ సురక్షితంగా ఉంచడమే కాకుండా.. బ్యాంకులను మించిన రిటర్నులను ఆఫర్ చేస్తుంటాయి. పోస్టాఫీసులో కూడా చాలా రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మూడు స్కీమ్స్ 7 శాతానికి పైగా రిటర్నులను అందిస్తున్నాయి.


సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్..


ప్రస్తుతం పోస్టాఫీసు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ నుంచి ఏడాదికి 7.4 శాతం వడ్డీని పొందవచ్చు. ఈ స్కీమ్‌పై పోస్టాఫీసు క్వార్టర్లీ వడ్డీని లెక్కిస్తోంది. 60 ఏళ్లు పైబడిన ఏ వ్యక్తి అయినా ఈ అకౌంట్‌ను తెరుచుకోవచ్చు. రిటైర్డ్ ఉద్యోగులైతే 55 ఏళ్ల వయసు పైన, 60 ఏళ్ల కంటే తక్కువ వయసుంటే చాలు.


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్..


ప్రస్తుతం పోస్టాఫీసు ఈ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఈ స్కీమ్‌లో ఒక ఏడాదికి కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లంప్‌సమ్ లేదా వాయిదాల్లో నగదును మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ డిపాజిట్లకు పన్ను మినహాయింపులుంటాయి. 15 ఏళ్ల కోసం ఈ అకౌంట్‌ను తెరవాల్సి ఉంది.


సుకన్య సమృద్ధి యోజన..


పోస్టాఫీసు సుకన్య సమృద్ధి యోజన పథకానికి ఏడాదికి 7.6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఈ అకౌంట్‌లో మీరు కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.లక్షన్నర వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. 10 ఏళ్ల లోపున్న ఆడపిల్లల పేరు మీద ఈ అకౌంట్‌ను తల్లిదండ్రులు చేరవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు ఈ అకౌంట్‌ను తెరవవచ్చు. ఒకవేళ కవలలు అయితే.. రెండు కంటే ఎక్కువ అకౌంట్లు తెరుచుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com