సీఎం జగన్ దావోస్ పర్యటన మీద ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయ్. ఇందులో భాగంగా టీడీపీ నాయకులూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... గతంలో చంద్రబాబు ఎన్నో పెట్టుబడులు తెచ్చారు – రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించారు – వాటన్నింటిని వైసీపీ పక్కదారి పట్టించేసింది – అప్పులను రూ.8.50 లక్షల కోట్లకు పెంచేశారు – రెండేళ్లలో రూ.11 లక్షల కోట్లు దాటించేస్తారు – నవరత్నాలు అన్నారు. బటన్ నొక్కుతున్నారు – బటన్ నొక్కుతున్నా ప్రజలకు డబ్బు రావట్లేదు – టీడీపీ కార్యకర్తలపై ఇష్టానుసారం తప్పుడు కేసులు – భవిష్యత్తులో మనతో అన్ని వర్గాలూ కలిసి వస్తాయి అని ఆశాభావం వ్యక్త పరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa