గురజాల ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ శివశంకర్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గురిజాల ఆర్డీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కలెక్టర్ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వైద్యం ఎలా అందుతుంది అంటూ రోగులను ఆరాతీసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఆస్పత్రిలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.