ఏపీలోని కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. అయితే మార్చిన పేరునే కొనసాగించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాలతో పాటు కాట్రేనికోన, కొత్తపేట, రావులపాలెం మండలాల్లో 144 సెక్షన్ విధించినట్టు చెప్పారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ఎవరూ కూడా బహిరంగ సభలు, ర్యాలీలు, నిరసనలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచడం కోసం 450 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.