వరుడికి బట్టతల ఉన్న విషయం తెలియడంతో వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో జరిగింది. అబ్బాయి తనకు బట్టతల ఉందన్న విషయం అమ్మాయి కుటుంబ సభ్యుల వద్ద దాచిపెట్టాడు. అయితే పెళ్లి మండపానికి వస్తుండగా వరుడు కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అతని తలకు ఉన్న విగ్గు ఊడిపోయింది. అతని బట్టతల చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోనని చెప్పింది. చివరికి ఈ పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. అయినా కూడా పెళ్లికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరుపగా, పెళ్లి కోసం అమ్మాయి తండ్రి ఖర్చు చేసిన రూ.5.6 లక్షలు తిరిగి ఇవ్వాలని తీర్మానం చేశారు. దీనికి అబ్బాయి తరఫు వారు అంగీకరించారు.