సుబ్రహ్మణ్యం ను కొట్టి చంపి స్వయంగా తన కారు లోనే మృతుడి ఇంటికి మృతదేహాన్ని తీసుకొచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు అని ఆరోపించారు టీడీపీ నాయకులూ అయ్యన్నపాత్రుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇది ప్రమాదం కాదు కొట్టి చంపారు అని కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, దళిత సంఘాలు , మూడు రోజుల నుండి పోరాడితే మృతదేహానికి పోస్టుమార్టం చేశారు..కొడితేనే చనిపోయాడు అని ఫోరెన్సిక్ నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు..మూడు రోజులుగా నిందితుడు అనంత బాబు ను కాపాడాలని ప్రయత్నించింది ఎవరూ? , ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందని తేలాలి అంటే సీబీఐ విచారణ జరపాలి. జగన్ రెడ్డి కి దమ్ముంటే ఈ కేసును CBI కి ఇచ్చి బాధిత కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలి అని సవాల్ విసిరారు.