పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట అనే చెప్పాలి. అలంటి పరిస్థితి నుండి కాసు మహేష్ రెడ్డి రాజకీయాలలో అడుగుపెట్టి , తన మాట , మంచితనాలతో వైసీపీ పార్టీ ద్వారా గెలవడం జరిగింది. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రతి నియోజకవర్గంలో నేతలు తమ కార్యకర్తలను సమ్మెళించే పనిలో పడ్డారు. అందులో భాగంగా పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పిడుగురాళ్ల టౌన్ లోని అన్ని వార్డులకు సంబంధించిన ముఖ్య నాయకులతో టీడీపీ ఇంచార్జి యరపతినేని శ్రీనివాస్ రావు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ప్రతి వార్డులోని ప్రస్తుత సమస్యల గురించి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరిగింది. కాగా ఏ మధ్యనే టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ తో ఈయన భేటీ ఐన సంగతి తెలిసిందే.