ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్యమైన విషయం. మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేశామని మెస్సేజ్ వచ్చిందంటే మీరు దానిని నమ్మకండి. దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐపై సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఫేక్ మెస్సేజులు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం పట్ల అటు ఎస్బీఐ, ఇటు కేంద్ర సర్కార్ అలర్ట్ అయ్యాయి. ఎస్బీఐ కస్టమర్లకు పలు సూచనలు చేశాయి.
ఎస్ఎంఎస్ లు, కాల్స్ కు స్పందించొద్దని ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది. అలాగే, వచ్చిన ఎస్ఎంఎస్ లోని లింక్ పైనా క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. అనుమానం కలిగించే ఏవైనా మెయిల్స్, ఎస్ఎంఎస్ లు వస్తే ఖాతాదారులు వెంటనే report.phishing@sbi.co.in కు తెలియజేయాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.