తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ కే ఆ రాష్ట్రంలోని జనం జై కొడుతోందటా. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ప్రజాదరణ పెరుగుతోందని ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ (ఐఏఎన్ఎస్)-సీఓటర్ సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం 2021లో ఎన్నికలు జరిగిన అసోం, పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రభుత్వాల పనితీరు పరంగా చూస్తే తమిళనాడు సర్కారు అత్యంత ప్రజాదరణ పొందిందని పేర్కొంది. ముఖ్యమంత్రులలో అత్యధికంగా 85% మద్దతు స్టాలిన్‌కే ఉన్నట్లు వెల్లడించారు.
ఇక ముఖ్యమంత్రుల విషయానికొస్తే అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మ ప్రజాదరణలో టాప్‌లో ఉన్నారు. 43 మంది ప్రజలు ఆయన పనితీరును మెచ్చుకుంటున్నారు. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, పినరయి విజయన్లు 41 శాతంతో ఉన్నారు. పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పట్ల 39 శాతం మంది చాలా సంతృప్తి వ్యక్తం చేశారు.