దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన పట్టును ప్రజల్లో అలాగే నిలుపుకొన్నారు. దేశంలో 44 శాతానికి మందికిపైగా ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్టు ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ (ఐఏఎన్‌ఎస్)-సీఓటర్ సర్వేలో వెల్లడయ్యింది. అలాగే, ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై 37.66 శాతం చాలా సంతృప్తిగా ఉన్నారని, 29.94 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారని తేలింది. ప్రధాని నరేంద్రమోదీకి 32 శాతం మంది అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. మోదీ పనితీరు బాగుందని 17 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 40 శాతం మంది కొంతవరకు బాగుందని తెలిపినట్లు పేర్కొన్నారు. ఇంకో 40% మంది అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు.