ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 02:49 PM

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దేశంలోనే నంబర్‌ వన్‌ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న ముఖ్యమంత్రిగా నిలిచారని వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య కొనియాడారు. ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌ రావు, నిరంజన్‌రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం ఎంపీ అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల హక్కుల గురించి పోరాడుతున్న నాకు మరింత పోరాటం చేసేందుకు, ఈ వర్గాలకు మరింత మేలు చేసేందుకు ఈ అవకాశం కల్పించింనందుకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com