ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భావితరాల భవిత–మూడు రాజధానులు పుస్తక ఆవిష్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 02:48 PM

మూడు రాజధానుల ఏర్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజద్‌బాషా పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణతో  ప్రజలకు ఒనగూరే ప్రయోజనాల గురించి నగరాలు మొదలుకుని మండల స్థాయి వరకు విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం, రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం కడప నగరంలోని మానస ఇన్‌ హోటల్‌లో ఫోరం రాయలసీమ అధ్యక్షుడు లయన్‌ కె.చిన్నపరెడ్డి అధ్యక్షతన డాక్టర్‌ గాజులపల్లె రామచంద్రారెడ్డి రాసిన భావితరాల భవిత–మూడు రాజధానులు పుస్తక పరిచయ సభ నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి ఇతర అతిథులతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోనే మిగతా ప్రాంతాలు ఎంతో వెనుకబడి రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి స్థితిలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఒకేలా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులతో పాలనా వికేంద్రీకరణ జరగాలన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com