ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలహీనవర్గాలంతా కలిసివచ్చి ‘బస్సుయాత్ర’ను విజయవంతం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 02:48 PM

బలహీనవర్గాలు గర్వంగా తలెత్తుకునే జీవించే విధంగా వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలకు జరుగుతున్న మంచిని వివరించేందుకే సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేపడుతున్నామని చెప్పారు. విజయవాడలో సామాజిక న్యాయభేరి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com