ఏపీని శ్రీలంకతో పోలుస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అసంబద్ధమైనవని, ఇది కేవలం రాజకీయ అక్కసుతో చేస్తున్న రాద్ధాంతమేనని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కొట్టిపారేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించలేదని, వారికి మేలు చేసిందేమీలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలుచేస్తూ ప్రజల ఆదరణను పొందుతుంటే.. దానిని ఓర్వలేక శ్రీలంక.. శ్రీలంక.. అంటూ గావుకేకలు పెడుతున్నారని మండిపడ్డారు. అసలు శ్రీలంక పరిణామాలకు, మనకు పోలికేంటని ప్రతిపక్ష నేతలను బుగ్గన ఓ ప్రకటనలో ప్రశ్నించారు.