అనుమతి లేని కంపెనీల విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారి షేక్షవాలి హెచ్చరించారు. ఈ మేరకు గురవారం ప్యాపిలి పట్టణంలో విత్తన షాపును తనిఖీ చేసి రికార్డులు, స్టాక్ పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ. రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే షాపును సీజ్ చేస్తామన్నారు. కొనుగోలుదారులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలు నమోదు చేయాలని సూచించారు.
ఫర్టిలైజర్ మరియు విత్తనాలు ఎమ్మార్పీ ధరలు కంటే ఎక్కువ అమ్మితే వాటి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని తెలియజేస్తున్నాము.