అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం ఎస్సీ కాలనీలో ఓ హత్యకేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి తంబళ్లపల్లె కోర్టులో హాజరు పర్చగా 15 రోజులు రిమాండు విధించినట్లు ఎస్సై మధు రామకృష్ణుడు తెలిపారు. ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మీదేవి గత నెలలో మృతి చెందగా మృతదేహాన్ని ఖననం చేశారు. మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి పూడ్చిన శవాన్ని గత నెల 26న వెలికి తీసి శవపరీక్ష నిర్వహించారు.