రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులపై రోజుకోక వస్తువులపై (అన్ని రకాల వాటిపై) బాదుడే బాదుడు అన్నట్లు వ్యవహరిస్తోంది. నిన్న మొన్నటి వరకు పెట్రోల్, పామ్ ఆయిల్, కూరగాయలు ఇలా ఒకటేమిటి అన్నిటిపై రేట్లు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుంది. అందులో భాగంగా ఈ నెల కరెంట్ బిల్లు చుస్తే అబ్బో. అయ్యో అనాల్సిందే. నిన్న మొన్నటి వరకు బిల్లుల యినిట్ రేటు వివరాలు ఇలా ఉన్నాయి.
0-30 యానిట్ల మధ్య యూనిట్కు రూ. 1. 90 ఛార్జ్
31-75 మధ్య యూనిట్కు రూ. 3
76-125 మధ్య యూనిట్కు రూ. 4. 50
126-225 మధ్య యూనిట్కు రూ. 6
226-400 మధ్య యూనిట్కు రూ. 8. 75
400 ఆపై యూనిట్కు రూ. 9. 75.
మొన్నటి వరకు కేవలం రూ. 300 వచ్చే బిల్లు ఇప్పుడు రూ. 700 దాటిపోతుందని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పలు ఉచిత పథకాలు పెట్టి రూ. 100 ఇచ్చి రూ 1000 దొబ్బుతున్నడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉంటే సామాన్య ప్రజలం ఎలా బ్రతకాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.