బడుగు, బలహీన వర్గాలకు చెందిన 17మంది మంత్రులతో, రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు స్ఫూర్తిని ఇచ్చేలా సామాజిక న్యాయ భేరి యాత్ర సాగిస్తున్నామని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలతోపాటు, మిగతా పేద వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ వర్గాలు ముఖ్యమంత్రికి అండగా ఉంటారన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆలోచనలను ప్రజలకు వివరిచేందుకు ఈ బస్సుయాత్ర కొనసాగుతోందని చెప్పారు. సాచ్యురేషన్ పద్దతిలో అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రజలందరికీ వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలంతా బస్సుయాత్రకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.