అమలాపురం అల్లర్ల ఘటనలో ఇప్పటి వరకు 46 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో బీజేపీ కోనసీమ జిల్లా కార్యదర్శి సుబ్బారావు కుమారుడు అజయ్, అదే పార్టీకి చెందిన నేత రాంబాబు, కాపు ఉద్యమనేత నల్లా సూర్యచందర్ రావు ఉన్నారు.ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. రెండు రోజుల క్రితం జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ కొందరు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై దాడికి యత్నించారు. మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే, కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పొన్నాడ సతీష్ ఇళ్లపై నిరసనకారులు దాడి చేసారు.