పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్‌గా ఉండేవారు. అయితే ఈ పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. ఇకపై అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలకు గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రి ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రాష్ట్ర కేబినెట్ మంత్రుల సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్ట సవరణ చేయనుంది. ఇందుకోసం త్వరలో ప్రత్యేక బిల్లును రూపొందించనున్నారు.