చిత్తూరు: పీలేరు అభివృద్ధికి రూ. 47 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, పీలేరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఈ నిధులను కేటాయించారని అన్నారు. వీటితో కె. వి. పల్లి మండలం, జిల్లెళ్లమంద పంచాయితీ, కొత్తశెట్టిపల్లిలో ఒక బస్ షెల్టర్, వగళ్ళ పంచాయితీ, జంగంపల్లి రోడ్డులో మరో బస్ షెల్టర్ నిర్మాణానికి ఒక్కోదానికి రూ. 2 లక్షలు వంతున నిధులు కేటాయించారని అన్నారు. అలాగే కలకడ మండలం, దిగువ తాండాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 5 లక్షలు, బస్ షెల్టర్ నిర్మాణానికి రూ. 3 లక్షల నిధులు ఇచ్చారన్నారు.
గుర్రంకొండ మండల కేంద్రంలో బస్ షెల్టర్ నిర్మించడానికి రూ. 20 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. అదేవిధంగా కె. వి. పల్లి మండలం, గాలివారిపల్లి పంచాయతీ, దిన్నెమీదపల్లిలో ఆర్ఓఆర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 3 లక్షలు, పైప్ లైన్ ఏర్పాటుకు ఆదనంగా మరో రూ. 2 లక్షలు, కొండేటివారిపల్లిలో పైప్ లైన్, విద్యుత్ మోటారు కోసం రూ. 2 లక్షలు కేటాయించారని పేర్కొన్నారు. కలికిరి మండలం, గుట్టపాలెం పంచాయితీ, గుట్టపాలెంలో బోరు మోటారు, పైప్ లైన్ కోసం రూ. 4 లక్షలు, భరిణెపల్లిలో మోటారు, పైప్లైన్ కోసం రూ. 4 లక్షలు వంతున ఎంపి గ్రాంట్స్ మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలియజేశారు.