అటవీశాఖకు చెందిన 382 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన తహసీల్దారుపై వేటు పడింది. పిచ్చాటూరు తహసీల్దార్ శ్రీదేవి గతంలో పెద్దపంజాణి మండలంలో పనిచేశారు. ఆ సమయంలో ఆమె అటవీ భూమికి పట్టాలు చేసి ప్రైవేటు వ్యక్తులకు రాసిచ్చారు. విచారణ చేసిన అధికారులు ఆమెపై వేటు చేశారు. డిప్యూటీ తహసీల్దారుగా పర్మినెంట్ రివర్షన్ ఇచ్చారు. అలాగే పెద్దమండ్యం వీఆర్వో శ్రీనివాసులును సర్వీసు నుంచి తొలగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa