జూన్ 1 నుంచి క్యారెట్లతో సంబంధం లేకుండా అన్ని బంగారం ఆభరణాలు తప్పనిసరిగా హాల్మార్క్డ్ చేసి విక్రయించాల్సిందే. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 1 నుంచి బీఐఎస్ హాల్ మార్కింగ్ లేకుండా వ్యాపారులు ఏ బంగారం ఆభరణాన్ని విక్రయించరాదు. ఏ వ్యక్తైనా బీఐఎస్ హాల్మార్కింగ్ సెంటర్ నుంచి హాల్ మార్కింగ్ చేసిన తర్వాతే విక్రయించాల్సి ఉంటుంది.