మన భారతీయ వంటశాలలో ఉపయోగించే మసాల దినుసుల వలన ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలున్నాయి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలతో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా యాలకులతో బోలెడన్నీ ప్రయోజనాలున్నాయి. డయాబెటిస్, ఆస్తమా, గుండె సమస్యలను ఉన్నవారికి యాలకులు బెస్ట్ ఆప్షన్. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇలాచీలు సరిగ్గా పనిచేస్తాయి. చలికాలంలో జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారు నల్ల యాలకులు వాడడం మంచిది. ఆందోళన, వికారం వంటి సమస్యలను నియంత్రిస్తుంది. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న ఫైటోకెమికల్స్. శరీరంలోని యాంటీ బాక్టీరియల్ కుప వ్యతిరేకంగా యాలకుల ఆయిల్ పనిచేస్తుంది. ఇవి గుండె సమస్య, డయాబెటిస్ సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. యాలకులు ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యాలకుల వాడుతుంటారు. నోటి దుర్వాసనను నియంత్రించడానికి భోజనం తర్వాత ఇది వీటిని తీసుకోవాలి. ఇది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది కావిటీస్, చిగుళ్ల వ్యాధులను నియంత్రిస్తుంది.
గతంలో చేసిన అనేక పరిశోధనల ప్రకారం టీ మరియు డెజర్ట్‌లలో వాసన కోసం కొంతమంది ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తినాలి. ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. కొన్నిసార్లు అంగస్తంభనను కూడా నయం చేస్తుంది. శృంగారంలో యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. సంతాన సాఫల్యత అవకాశాలను పెంచుతాయి. కండరాలు బాగా పని చేసేలా చేస్తాయి. నిజానికి, చాలా సార్లు, యాలకులు పురుషులలో లైంగిక ఉత్సాహాన్ని పెంచడానికి ఉపయోగించే ఔషధాలకు సహజ ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. నిద్రపోయేటప్పుడు రెండు యాలకులను తీసుకోవడం వలన సానుకూల స్పందన లభిస్తుంది. ఎలాయిచి యొక్క తీవ్రమైన వాసన సమస్యగా మారితే, రక్త ప్రవాహం మరియు ప్రసరణను పెంచడానికి ప్రత్యామ్నాయంగా ఏలకుల నూనెను ఉపయోగించవచ్చు.