జగ్గయ్యపేట మండలంలో ఈ మధ్య కాలంలో కొన్ని గ్రామాలల్లో, కొన్ని ప్రాంతాలల్లో సుమారు 14 లేక 16 సంవత్సరాల మద్య వయస్సులోని బాలికలకు బాల్య వివాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధిత ప్రభుత్వ అధికారులు బాల్య వివాహాలు చేస్తున్న తల్లిదండ్రులకు అవకాహన కల్పిస్తున్నప్పటికి, అప్పటికప్పటికి వివాహం వాయిదా వేసుకుని దేవాలయ ప్రాంగణంలో సాంప్రదాయ పద్ధతిలో బాల్య వివాహాం చేస్తుకుంటున్నారు.
ఆడ పిల్లలకి 18 సంవత్సరాలు , మగ వారికి 21 సంవత్సరాలు నిండకుండా వివాహం చేయరాదని చట్టాలు చెప్పుతున్నాయి. దీనిని వ్యతిరేకించి బాల్యవివాహాలుచేసిన, ప్రోత్సహించిన తల్లిదండ్రులు గాని, పెద్దలు గాని, పురోహితుల పై కఠినమైనచర్యలు, శిక్షలు, జరిమానాలుంటాయని బాల్య వివాహాం నిరోధక చట్టం 1929 చెప్పుతుంది. బాల్యంలోనే బాలికలకు బాల్య వివాహాలు చేయడంతో గర్భస్థ సమస్యలు, పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఒక్కనొక్క సందర్భంలో ఇటువంటి వాటిని డిల్లీ కోర్టు వారు బాల్య వివాహాం అత్యాచారం కంటే ఘోరం అని 2014 సంవత్సరంలో అన్నది.
బాల్య వివాహ నిరోధక చట్టం 1929 ప్రకారం జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు(ఫోన్ నంబర్ 100), మహిళా శిశుసంక్షేమ శాఖ పథకం సంచాలకులు, ఐసీపీఎస్, చైల్డ్‌లైన్(ఫోన్ నంబర్ 1098), తహసీల్దార్, సీడీపీవో, గ్రామస్థాయిలో అయితే వీఆర్‌వో, పంచాయతీకార్యదర్శులకు, సచివాలయంలో వెంటనే సమాచారాన్ని తెలియజేయాలని తెలుస్తుంది. ఇన్ని వ్యవస్థలు ఉన్నా తల్లిదండ్రులలో అవగాహన లోపంతో చదువు, ఆటలాడుకుంటున్న 14, 15 సంవత్సరాల వయస్సు కలిగిన బాలికలు బాల్యం వారికి వివాహంతో మొడుబారుతుందని సంఘ సంస్కర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహిళా రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశా యాప్ లాంటి వాటి పై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్న సమయంలో పట్టిష్టమైన బాల్య వివాహ నిరోధక చట్టం 1929 ఉన్నప్పటికీ, ప్రభుత్వ సిబ్బంది బాల్య వివాహాలు చేస్తున్న తల్లిదండ్రుల నుండి బాల్య వివాహం చేయమని వ్రాతపూర్వక హామీతో చేతులు దులుపుకుంటున్నారు. అయినప్పటికి బాల్య వివాహాలు మండలంలో పలుచోట్ల జరుగుతూన్నే ఉంటున్నట్లు కొంతమంది ప్రజల నుండి సమాచారం వస్తుంది.