అనంత జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెనుకొండ మండలం కియా సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉగాది హోటల్ వద్ద వైసిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రికి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకులు బ్రహ్మసముద్రం శ్రీనివాసులు , కర్ర సంజీవరెడ్డి, కళ్యాణ్ రాయల్, దిలీప్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.