అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని వాల్మీకి కళ్యాణ మండపంలో గౌతమ్ కుమార్ అధ్యక్షతన నియోజకవర్గంలోని 5 మండలాల్లో జనసేన కమిటీలు ఏర్పాటు చేయడంలో భాగంగా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ ఆధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో జిల్లా పార్టీ ఆధ్యక్షులు టి. సి వరుణ్ సూచన మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. జనసేన పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో ప్రతిఒక్కరు పాల్గోని జయప్రదం చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పార్టీ సిద్దాంతాను ప్రజలలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.