తెలుగు ప్రజల ఆరాధ్య దైవం , ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం గా భావించిన మహానుభావులు టిడిపి వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కు భారత రత్న అవార్డు ఇవ్వాలని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం అధ్యక్షులు బోయ రామకృష్ణ నాయుడు కోరారు. శనివారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్ చౌదరి ఆదేశాలు మేరకు స్థానిక నిరాశ్రయులు వసతి గృహంలో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశ్రయంలో వృద్దులకు పాలు పండ్లు, బ్రేడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం గా బావించి పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేసిన ఘనత ఎన్టీఆర్ ది. వారి అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం నాయకులు నల్లన్న, ఉరుకుందు, గుడికల్ కొండయ్య, దస్తగిరి, శేఖర్, మాచామి, రామకృష్ణ, ఓబులేసు, నరసింహ, రంగనాయుడు, అంజి, పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa