శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా అమెరికాలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రూ. 2 రూపాయలకే భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పట్టణానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందన్నారు. అనంతరం వసుంధరాదేవి రిబ్బన్ కట్ చేసి క్యాంటీన్ ను ప్రారంభించి స్వయంగా భోజనాన్ని వడ్డించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa