వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ భేరి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా ఈ నెల 26 వ తేది శ్రీకాకుళం నుండి చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల 29న ఆదివారం అనంతపురంలో ముగియనుంది. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు అనంతపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ ఎత్తున సామాజిక న్యాయభేరి ముగింపు సభ నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ తెలిపారు. కావున ఈ సామాజిక న్యాయ భేరి ముగింపు సభకు రాష్ట్రవ్యాప్తంగా మరియు అనంతపురం జిల్లా వ్యాప్తంగా వున్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ప్రతి ఒక్కరు ఈ బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చి సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను విజయవంతం చేయవలసినదిగా మంత్రి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa