స్థానిక సమీద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏంజల్స్ అమెరికా వారి సహకారంతో టోకూరు పంచాయతీ పరిధి బలియగూడ గ్రామంలో 6 నెలలు నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు ఉచితంగా విటమిన్'ఎ ' మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జడ్పిటిసి దీసరి. గంగరాజు మాట్లాడుతూ. ఏజెన్సీ ప్రాంతంలో చిన్న పిల్లలకు నులిపురుగుల సమస్య క్రమేపి ఉంటుందని ప్రతి పిల్లలలో శారీరక మానసిక ఎదుగుదల పెంపొందించ వచ్చునని ఈ చక్కటి అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కిల్లో. మోస్య వార్డు సభ్యులు గ్రామ ప్రజలు సమిద సంస్థ కార్యదర్శి డీ. వీరభద్రరావు సంస్థ కో. ఆర్డినేటర్ దీసరి. బుద్దురాజు సింహాద్రి అప్పలరాజు బిడ్డ. ప్రసాద్ దేముడమ్మ సమీద సంస్థ అధ్యక్షుడు రమణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa