చింతపల్లి మండలంలోని గొందిపాకలు నుండి ఎర్రవరం గ్రామానికి వెళ్లే రహదారి ఇటీవల కురుస్తున్న అకాల వర్షాల కారణంగా బురదతో చిత్తడిగా మారింది. ఈ మార్గంలో రాకపోకలకు ద్విచక్ర వాహనదారులు ప్రయాణికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఈ మధ్య కాలంలో మట్టి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి అర్ధాంతరంగా విడిచి పెట్టడంతో వాహనచోదకులకు కష్టాలు తప్పడం లేదు. అధికారులు సత్వరమే రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa