పంజాబ్ కాంగ్రెస్ నేత, గాయకుడు సిద్ధూ మూసేవాలా (28) దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం అతడిని దుండగులు కాల్చి చంపారు.. మాన్సా జిల్లాలోని జవహర్ కే గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.సిద్ధూ జీపులో జవహర్‌లాల్ నెహ్రూ గ్రామానికి వెళ్తుండగా కొందరు దుండగులు ఆయనపై 20 రౌండ్లు కాల్పులు జరిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిద్ధూను ఆస్పత్రికి తరలించారు.ఆసుపత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa