సినిమాలో మనం చూస్తునే ఉంటా. గ్రామాల్లో ఇచ్చే తీర్పులు చాలా వింతంగా ఉంటాయి. అది సినిమా కాబట్టి చూసి కాసింత ఆనందం పొందుతాం. కానీ సినిమాల్లో తరహా నిజంగా గ్రామాల్లో ఉన్నాయా అంటే ఇంకా కొనసాగుతున్నాయన్నది ఓ గ్రామ తీర్పు రుజువు చేసింది. ఏపీలోని ఓ గ్రామంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో మద్యం విక్రయాలు అడ్డుకున్న ఓ వ్యక్తిని ఆ గ్రామ పెద్దలు ఏకంగా గ్రామం నుంచి బహిష్కరించారు. శ్రీ బాలాజీ జిల్లా పరిధిలోని ఏర్పేడు మండలం కొత్త వీరాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామంలో మద్యం విక్రయించరాదని చెప్పిన మునికృష్ణారెడ్డి అనే వ్యక్తి.. గ్రామంలో మద్యం విక్రయాలను అడ్డుకున్నారట. దీంతో ఈ వ్యవహారంపై దృష్టి సారించిన గ్రామ పెద్దలు మద్యం విక్రయాలను అడ్డుకున్నందుకు మునికృష్ణారెడ్డిపై గ్రామ బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం గ్రామంలో దండోరా కూడా వేయించారు. ఈ ఘటనపై అటు పోలీసులకు గానీ, ఇటు ప్రభుత్వాధికారులకు గానీ మునికృష్ణారెడ్డి ఇప్పటిదాకా ఫిర్యాదు చేయలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa