రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.86,912 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. ఇందులో ఏపీకి రూ.3,199 కోట్లు, తెలంగాణకు రూ.296 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రాలకు ఇప్పటివరకు జీఎస్టీ పరిహారం మొత్తం చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.