చంద్రబాబు తన సామాజిక వర్గానికి మాత్రమే ప్రతినిధి అని, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమసమాజ స్థాపనకు ప్రతినిధి అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. 75 ఏళ్ల స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ గతంలో సామాజిక ధర్మం పాటించలేదని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే సీఎం వైయస్ జగన్ సామాజిక ధర్మం, సామాజిక న్యాయం పాటించారన్నారు. మహానాడు వేదికపై చంద్రబాబు.. ఒక మాయల ఫకీరులా కూర్చుని రెండు రోజుల పాటు ప్రభుత్వం మీద, సీఎంపైన అడ్డగోలు విమర్శలు, తిట్ల పురాణంతో సాగించాడని ధ్వజమెత్తారు. తొడలు కొడితే, బూతులు తిడితే సామాజిక న్యాయం అవుతుందా..? అని చంద్రబాబును మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు.