కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో చేతన్(31) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతన్, అతని ప్రియురాలు తరచూ కలుసుకునేవారు. చేతన్ ఆమె సరదాల కోసం బాగానే ఖర్చు చేసేవాడు. ఇటీవల పెళ్లి చేసుకుందామని చేతన్ అడగ్గా ఆమె ఒప్పుకోలేదు. దీంతో చేతన్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రేయసి కోసం రూ.4.50 లక్షలు ఖర్చు చేశానని, ఆ డబ్బుల్ని వసూలు చేసి తన ఫ్యామిలీకి ఇవ్వాలని చేతన్ సూసైడ్ నోట్ రాశాడు.