పాకిస్థాన్ లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది వరకూ ఎప్పుడూ లేని విధంగా వంట నూనె, నెయ్యి ధరలు వరుసగా లీటరుకు రూ.213, రూ.208 పెరిగాయి. పెరిగిన ధరలతో ఇప్పుడు నెయ్యి లీటర్కు రూ.555, వంట నూనె రూ.605కు చేరింది. పెరిగిన ఈ కొత్త ధరలు జూన్ 1 నుంచే అమలులోకొచ్చాయని పాకిస్థాన్ మీడియా తెలియజేసింది.