మన ఆరోగ్యం మనం తినే ఆహారానికి డైరెక్ట్ గా లింక్ అయి ఉంటుంది. మనం తినే ఆహారం మన ఆకలిని తీర్చడమే కాక మనం ఫిట్ గా ఉండేట్లుగా కూడా చేస్తుంది. అందుకే, మనం ఏం తింటున్నాం అన్న దాని మీద శ్రద్ధ పెట్టి ఉండాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు, వీలున్నంత వరకూ ఈ ఫుడ్ ని ఎవాయిడ్ చేయాలని అందరికీ తెలిసినా కూడా కొంత మంది పీజా, బర్గర్, కేక్స్ వంటి వాటిని తీసుకుంటూనే ఉంటారు. అయితే, రీసెంట్ ఒక స్టడీలో ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఉన్న ప్రిజర్వేటివ్స్, షుగర్ హార్ట్ డిసీజ్, అకాల మరణం వచ్చే రిస్క్ ని పెంచుతాయని తెలిసింది. అన్‌హెల్దీ ఫుడ్ తీసుకున్న వారిలో 15% క్యాలరీస్ వారు తీసుకున్న ప్రాసెస్డ్ ఫుడ్ నుండే లభించాయి. అంటే 300 నుండి 1250 క్యాలరీలు ఇచ్చే ప్రాసెస్డ్ ఫుడ్. ఇది రెండు నుండి ఎనిమిది సర్వింగ్స్ హాట్ డాగ్స్, క్యాండీ బార్స్, సోడా వంటి వాటితో సమానం.
ఈ కేటగిరీలో ఉన్న వారు, ఇంత కంటే తక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్న వారితో పోలిస్తే, కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ వల్ల మరణించే రిస్క్ 58% ఎక్కువగా ఉంటుంది. అలాగే, స్ట్రోక్, లేదా ఇంకే ఇతర సెరిబ్రో వాస్క్యులర్ డిసీజ్ వల్ల ప్రాణాలు కోల్పోయే శాతం 52% ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇంతకు ముందు జరిగిన పరిశోధన వల్ల అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ బాగా రుచిగా ఉంటాయనీ, ఆకలిని పెంచుతాయనీ తెలిసింది. ఫలితంగా అవసరమైన దాని కన్నా ఎక్కువ తినేస్తాం. అది బరువు పెరగడానికి దారి తీస్తుంది.