చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనిపై బీహార్‌లో బుధవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. న్యూ ఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ లిమిటెడ్ అనే ఫెర్టిలైజర్స్ సంస్థకు గతంలో ప్రచారకర్తగా ధోని వ్యవహరించాడు. ఆ సంస్థ నుంచి కొన్న ఎరువుల్లో నాణ్యత లేదని, తమకు రీఫండ్ చేసిన చెక్కు బౌన్స్ అయిందని ఎస్కే ఎంటర్‌ప్రైజస్ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో ధోనితో పాటు ఏడుగురు సంస్థ ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.