ఐపీఎల్‌తో పాటు ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో ఎన్నో అద్బుతమైన రికార్డులను ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సాధించాడు. అయితే తనను భయపెట్టిన బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. అయితే తామిద్దరం గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉండడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు.