స్పైడర్‌మ్యాన్ తరహాలో ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్న భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్టు షాకిచ్చింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా స్పైడర్‌మ్యాన్ డ్రెస్ వేసుకుని, నిబంధనలకు విరుద్ధంగా ఐదుగురితో గుమిగూడినందుకు కోట్ర వెంకట సాయి రోహన కృష్ణకు తాజాగా 4,000 సింగపూర్ డాలర్ల ఫైన్ వేసింది. భారత కరెన్సీలో దాని విలువ రూ.2.24 లక్షలు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘించిన వారి పట్ల సింగపూర్ కఠినంగా వ్యవహరిస్తోంది.