వాట్సాప్ గ్రూపులో పసిబిడ్డను అమ్మకానికి పెట్టిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. విజయవాడలో ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ అమృతరావు గతకొంతకాలంగా జి.కొండూరులో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. 3 రోజుల పసిపాపను ఆయన రూ.3లక్షలకు అమ్మకానికి పెట్టినట్లు ఓ వాట్సాప్ చాటు తెలుపుతోంది. విషయం తెలుసుకున్న "దిశ" పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.