నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకపాటి విక్రమ్ రెడ్డికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీ ఫారం అందజేశారు. దీంతో విక్రమ్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.సీఎం జగన్ కేబినెట్లో పర్యావరణ శాఖ మంత్రిగా పని చేస్తూ ఈమధ్య గుండెపోటుతో మరణించిన మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది.అయితే గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డికి పార్టీ అభ్యర్థిగా సీఎం జగన్ ఖరారు చేశారు.