హెర్ ఫాల్ సమస్యతో ఇటీవల చాలా మంది బాధపడుతున్నారు. దువ్వుకున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు రోజూ కొన్ని వెంట్రుకలు రాలటం సహజమే. కానీ పెద్ద మొత్తంలో వెంట్రుకలు రాలుతుంటే అలర్ట్ అవ్వాల్సిందే. ఒత్తిడి, పోషణ లోపం, ఆందోళన వంటి వాటితో జుట్టు రాలిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. జుట్టు రాలడాన్ని పూర్తిగా ఆపలేకపోయినా తగ్గించుకునే అవకాశం ఉంది. అందుకు ఇలా చేయండి.
తరచూ తల స్నానం చేయడం, పూర్తిగా ఆరిన తర్వాతే తల దువ్వటం, బాదం నూనె వంటి పరిమళ తైలాలతో మాడును మర్దన చేయండి. తేలికైన షాంపూలనే వాడండి. అలాగే గుడ్లు, పాలకూర, ఆల్ బుకార పండ్లు, మజ్జిగ, పెరుగు తినండి. అన్నిటికంటే ముఖ్యం కంటినిండా నిద్రపోవడం. ఇలా చేయడం వల్ల జుట్టు పలచబారకుండా వెంట్రుకలు పెరగడానికి తోడ్పడతాయి.